దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

ఇంద్రకీలాద్రిపై కొలువైఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో 3వ తేదీ నుండి జరగనున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుకు నేడు అందచేశారు. ఈ కార్యక్రమంలో దేవదాయ, ధర్మదాయ శాఖ కమీషనర్ శ్రీ సత్యనారాయణ, ఆలయ అధికారులు కూడా పాల్గొన్నారు. ముందుగా వేద పండితులు సీఎం ను ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదాన్ని, శేషవస్త్రాన్ని అందచేశారు.