జనవరిలో అంతర్జాతీయ తెలుగు సంబరాలు
అంతర్జాతీయ తెలుగు సంబరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరం గ్రామంలో వచ్చే 6, 7, 8 తేదీల్లో ఆంధ్ర సారస్వత పరిషత్ (భీమరం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు పరిషత్ పాలకమండలి చైర్మన్ గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వెస్ట్బెర్రీ హైస్కూల్ గ్రాండ్ ప్రాంగణంలో సంబరాలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. జనవరి 3న భీమవరంలో తెలుగు భాష వైభవ శోభాయాత్ర నిర్వహిస్తామన్నారు. జవనరి 6న ప్రాచీన కవులు, రాజవంశీయులు కుటుంబీకులకు ఆంధ్ర వ్మాయ పూర్ణకుంభం పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. జవనరి 8వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగింపు సభ అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ సంబరాల్లో పాల్గొనేందుకు వచ్చే వారికి ఎలాంటి ప్రవేశ రుసుం లేదని, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఉచిత వసతి, రవాణా, భోజన సదుపాయం కల్పిస్తామని జిల్లా ఉత్సవ కమిటీ నేతలు తెలిపారు.













