అంధ్ర సారస్వత పరిషత్ “పూర్ణకుంభ పురస్కారాలు”
అంధ్ర సారస్వత పరిషత్ అంతర్జాతీయ తెలుగు సంబరాలు జనవరి 6,7,8 2022 తేదీలలో భీమవరం వెస్ట్ బెర్రీ హై స్కూలులో నిర్వహిస్తోంది,
ఈ సందర్భంగా జనవరి 6 తారీఖు సాయంత్రం 4 గంటలకు భీమవరం డాక్టర్స్ కాలనీ లోని ప్రత్యేక వేదిక పై ప్రాచీన కవుల & కళాకారుల కుటుంబీకులకు, ప్రముఖ తెలుగు రాజసంస్థానాల వారసులకు, రాష్ట్రేతర తెలుగు సంఘాల వారికి, తెలుగు పత్రికలకు “పూర్ణ కుంభ” పురస్కారాలను మిజోరం గవర్నర్ శ్రీ కంభంపాటి హరిబాబు, అంధ్రప్రదేశ్ ఉప శాసన సభాధిపతి శ్రీ కోన రఘుపతి ల చేతుల మీదుగా అందజేయనున్నామని పరిషత్ అద్యక్షులు డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి శ్రీ మండలి బుద్ధప్రసాద్, పూర్వ కర్ణాటక శాసన సభాధిపతి శ్రీ రమేష్ కుమార్, మంత్రులు శ్రీ సి.హెచ్ శ్రీ రంగనాధరాజు, శ్రీ పేర్ని నాని, శాసన సభ్యులు శ్రీ గ్రంధి శ్రీనివాస్, శ్రీ మంతెన రామరాజు , లయన్ డా. క్రిష్ణంరాజు శ్రీ తదితరులు పాల్గొన నున్నారని తెలియజేసారు.
భట్టిప్రోలు శ్రీనివాస రావు
మీడియా బోర్డ్ చైర్మన్
98487 45676













