అంతర్జాతీయ తెలుగు మహాసభల .. కరపత్రాల ఆవిష్కరణ
రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభలు-2024 జవనరి 5, 6, 7 తేదీల్లో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు తెలుగు సభల కృష్ణాజిల్లా కన్వీనర్ వసుధ బసవేశ్వరరావు తెలిపారు. మహాసభల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్ర సాహిత్య పరిషత్, చైతన్య విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో సభలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కళా పరిషత్ సభ్యులు పీఎంఎస్ ప్రసాద్, ఎన్.త్రివిక్రమరావు తదితరులు పాల్గొన్నారు.













