నేటి నుంచి అంతర్జాతీయ తెలుగు సంబరాలు
ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని పెదఅమిరంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ తెలుగు సంబరాలు నేడు ప్రారంభం కానున్నాయి. పూర్ణకుంభ పురస్కారాల ప్రదానోత్సవ సభతో వేడుకలకు శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్య అతిథులుగా మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు, రాష్ట్ర మంత్రులు పేర్ని నాని, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, పలువురు ప్రముఖలు పాల్గొంటారని పరిసత్ మీడియా కమిటీ చైర్మన్ భట్టిప్రోలు శ్రీనివాసరావు తెలిపారు. సినీనటుడు సాయికుమార్‌తో పాటు పలవురు కళాకారులను సత్కరించనున్నట్లు వెల్లడించారు.













