విదేశీ విమాన సర్వీసులు పున:ప్రారంభం

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ విమాన సర్వీసులు పున ప్రారంభమయ్యాయి. 2 నెలల అనంతరం తొలి విమాన సర్వీస్ దుబాయ్ నుంచి సాయంత్రం 6:20 గంటలకు ఇక్కడికి చేరుకుంది. ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ముగ్గురు చిన్నారులతో పాటు 65 మంది ప్రవాసాంధ్రులు ఇక్కడికి చేరుకున్నారు. వీరికి అంతర్జాతీయ టర్నినల్‍లో థర్మల్ స్క్రీనింగ్‍తో పాటు జిల్లాల వారీగా రిజిస్ట్రేషన్ పక్రియను అధికారులు నిర్వహించారు. ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించి, అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులు ద్వారా వారిని గమ్యస్థానాలకు చేర్చారు. కువైట్ నుంచి ఎయిరిండియా విమాన సర్వీస్‍లు నేడు ప్రారంభం కానున్నట్లు ఎయిర్‍పోర్ట్ అధికారులు తెలిపారు.