ఏపీలో భక్తి ఎక్కువ.. అందుకే అక్కడ అభివృద్ధి, ఆనందం
ఆంధ్రప్రదేశ్‌లో భక్తి ఎక్కువ, భక్తి ఉన్న చోట అభివృద్ధి ఆనందం ఉంటుందని అని కేంద్రమంత్రి శర్బానంద సోనోవాల్ అన్నారు. విశాఖ పోర్టులో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్, 600 ట్రక్ పార్కింగ్ టెర్నినల్, కవర్డ్ స్టోర్ షెడ్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సోనోవాల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సహజ వనరులు కలిగిన రాష్ట్రమని పేర్కొన్నారు. విశాఖ పోర్టు దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. సాగరమాల కార్యక్రమంలో భాగంగా పోర్టులను ఆధునీకరిస్తున్నాం. పోర్టుల కేంద్రంగా పారిశ్రామిక అభివృద్ధి చేపట్టాం. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో టెర్నినల్ సేవలు ప్రారంభించాం. విశాఖలో కాలుష్యం నియంత్రించే ప్రక్రియ చేపట్టాం. కాలుష్య నియంత్రణలో భాగంగానే కవర్డ్ స్టోరేజ్ షెడ్‌ను ఏర్పాటు చేశాం అని అన్నారు.













