ఏయూలో అంతర్జాతీయ సదస్సు
ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా ఈ నెల 11 నుంచి మూడు రోజులపాటు రిమోట్ సెన్సింగ్, విపత్తు నిర్వహణపై అంతర్జాతీయ సదస్సు (ఐసిఆర్ఎస్డిఎ)ను నిర్వహిస్తున్నట్లు ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 11 నుంచి 13 వరకూ జరిగే ఈ సదస్సును ఏయూ ఇంజనీరింగ్ కళాశాల జియో ఇంజనీరింగ్ కళాశాలజియో ఇంజనీరింగ్ విభాగం నిర్వహిస్తోందన్నారు. 11న అమలాపురం ఎంపి.పి.రవీంద్రబాబు ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సదస్సులో అమెరికా, ఇండోనేషియా, చైనా, కొరియా, జపాన్, మలేషియా, ఇథియోపియా తదితర దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు నిపుణులు హాజరవుతారన్నారు.













