విశాఖలో అంతర్జాతీయ సదస్సు
వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఎదురయ్యే సవాళ్లకు పరిష్కార మార్గాలు, సాగునీటి కొరత నివారణకు విధానాల రూపకల్పన, జలవనరుల నిర్వహణ తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ నగరంలో నవంబరు 2 నుంచి 8 వరకు అంతర్జాతీయ సదస్సు జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. 25వ అంతర్జాతీయ కాంగ్రెస్, 74వ ఐఈసీ (ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్) సందర్భంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రారంభ కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. 90 దేశాల నుంచి అతిథులు, ఐసీఐడీ, సీడబ్ల్యూసీ ఉన్నతాధికారులు, సభ్యులు హారవుతారన్నారు.













