గన్నవరం నుంచి త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు
గన్నవరం ఎయిర్పోర్టు నుంచి త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గన్నవరం విమానాశ్రయం విస్తరణ పూర్తయ్యాక అంతర్జాతీయ విమానాలను ప్రారంభిస్తామన్నారు. అలాగే ఈ నెల 19వ తేదీన గన్నవరం నుంచి ముంబైకి నేరుగా విమాన సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా మధ్యాహ్నం 1:30 సీప్లేన్ ట్రయల్ రన్ జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు అశోక్ గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు.













