గృహ నిర్మాణం పధకంలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన
• ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద మౌలిక సదుపాయాల కల్పనకు రూ.47.57621 కోట్ల కేటాయింపు. అవసరాలకు అనుగుణంగా కేటాయింపులపై పాలనాపరమైన ఉత్తర్వులివ్వటానికి ఎ.పి.ఎస్.హెచ్.సి.ఎల్ ఎండీకి అధికారం.
• ఎన్టీఆర్ గ్రామీణ, ప్రీ-ఎన్టీఆర్ రూరల్, ప్రీ-ఎన్టీఆర్ అర్బన్, బి.ఎల్.సి గృహనిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా కొన్ని జిల్లాలలో కాలనీలలో మౌలిక సదుపాయాల కోసం రూ.19.9566 కోట్ల మంజూరు.
అర్బన్ హౌసింగ్ కోసం భూములు :
• విజయనగరం జిల్లా రాజాం మండలం కంచరం గ్రామంలో 23.36 ఎకరాల భూమిని అర్బన్ హౌసింగ్ కోసం కేటాయిస్తూ మంత్రిమండలి నిర్ణయం.
• అనంతపురము జిల్లా పమిడి పట్టణంలో 25 ఎకరాల భూమిని ఎన్టీఆర్ పట్టణ గృహ నిర్మాణం కోసం ఉచితంగా అందించాలని మంత్రిమండలి నిర్ణయం.
• టిడ్కో ఇక్కడ ఎన్టీఆర్ గృహ నిర్మాణాన్ని చేపడుతుంది.
మెగా ప్రాజెక్టులకు రాయితీలు :
• గత నవంబరులో ఎస్ఐపీబీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా మెగా ప్రాజెక్టులకు రాయితీలు ప్రకటిస్తూ జారీ అయిన ఉత్తర్వులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
• కేపీఆర్ ఇండస్ట్రీస్‌కి చెందిన 243.13 ఎకరాల భూమిని గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌కు బదలాయిస్తూ కేబినెట్ నిర్ణయించింది. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొంతమూరు గ్రామంలోని, బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో ఉన్న ఈ స్థలంలో 2700 కోట్ల రూపాయల పెట్టుబడితో మూడు దశల్లో కాస్టిక్ సోడా ప్లాంట్ ను నెలకొల్పనున్నారు. దీనివల్ల 1300 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.
• కాకినాడ ఎస్ఈజడ్లో క్రూడ్, కెమికల్ మ్యానుఫ్యాక్ఛరింగ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు హల్ధియా పెట్రో కెమికల్ లిమిటెడ్ కంపెనీకి ప్రత్యేక రాయితీల ప్యాకేజీ ఇవ్వడానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహాకాల బోర్డు (ఎస్ఐపీబీ)లో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి జనవరి 3 న ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే హల్దియా పెట్రో కెమికల్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. వీటిని అంగీకరిస్తూ కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
కియా ఒప్పందానికి ఆమోదముద్ర :
• కియా మోటార్స్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 15న చేసుకున్న ఒప్పందంపై కూడా మంత్రి వర్గం ఆమోదం వేసింది. అనంతపురం జిల్లా గూడుపల్లి, యర్రమంచి గ్రామాల పరిధిలో ప్రాథమికంగా సంవత్సరానికి 3 లక్షల కార్లను ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఈ ఒప్పందం కుదరింది.
‘కియా’ క్రియారూపంలో తెచ్చిన పరిశ్రమల శాఖకు ముఖ్యమంత్రి ప్రశంసలు :
• కియా మోటార్స్ తొలికారు విడుదలపై మంత్రిమండలిలో చర్చ. ఇదొక చారిత్రాత్మక అంశం. పరిశ్రమల శాఖకు ముఖ్యమంత్రి అభినందనలు. ఈ అభినందనలను మంత్రిమండలిలో రికార్డ్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించిన ముఖ్యమంత్రి. సాల్మన్ రాజు బృందానికి అభినందనలు. ‘కియా’ తమ ద్వారానే వచ్చిందన్న బీజేపీ నేతల వ్యాఖ్యలను ఎద్దేవా చేసిన సీఎం.
• గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వోక్స్వ్యాగన్ను రాష్ట్రానికి దూరం చేశారని, జర్మనీలో అధికారులను జైలుపాలు చేశారని, ఇక్కడేమో బొత్సకు ప్రమోషన్ ఇచ్చారని విమర్శించిన ముఖ్యమంత్రి. అశోక్ లేలాండ్, ఇసుజు, హీరో మోటాకార్ప్, అపోలో టైర్స్ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ను ఆటోమొబైల్ హబ్‌గా రూపొందిస్తున్నాం.
SC, ST పారిశ్రామికవేత్తలకు చేయూత :
• ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్ధికంగా చేయూత. NSCFDC& NSTDFC సౌజన్యంతో స్టేట్ ఛానెలైజింగ్ ఏజెన్సీ (SCA)ల ఏర్పాటు.
• రూ.50 కోట్ల ప్రభుత్వ గ్యారంటీ (ఇందులో రూ.25.కోట్లకు NSCFDC, మరో రూ.25 కోట్లకు NSTDFC గ్యారంటీ). రెండు శాతం గ్యారెంటీ కమిషన్ చెల్లిస్తూ ఈ సంస్థల సహకారంతో ఎస్టీ, ఎస్సీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రుణాలు పొందేందుకు వీలుకల్పించే విధాన నిర్ణయం. మంత్రిమండలి ఆమోదం.
చక్కెర కర్మాగారాలకు చేయూత :
• అవసరమైన సహకార చక్కెర కర్మాగారాలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా షరతులు లేని డీఫాల్ట్ గ్యారంటీ పథకం కింద 7.85% వడ్డీరేటుతో NCDC నుంచి రూ.200 కోట్ల రుణం. మంత్రిమండలి ఆమోదం.
మహిళా పారిశ్రామికవేత్తలకు భూమి:
• విశాఖ జిల్లా ఆనందపురం మండలం గిడిజాల గ్రామ పరిధిలో భారత మహిళా ఔత్సాహిక పారిశ్రామికేవేత్తల సంఘానికి 55 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు.
• చ.మీ ఒక్కింటికి రూ.679 వంతున ఎకరం రూ. 27,47, 917 చొప్పున కేటాయించే షరతులపై మంత్రిమండలి ఆమోదం. పరిశ్రమలకు పెట్టుబడిగా రూ. 200 కోట్లు
• ఐదు వేలమందికి ఉపాధి.
జేగురుపాడులో ఇండస్ర్టియల్ పార్క్ ఏర్పాటుకు భూమి :
• తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం జేగురుపాడు గ్రామంలో 38.67 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు నిమిత్తం APIIC కాకినాడ జోనల్ మేనేజర్‌కు ఉచితంగా కేటాయిస్తూ మంత్రిమండలి నిర్ణయం.
విశాఖ IT పార్కుకు భూమి :
• విశాఖలో IT పార్కు అభివృద్ధి నిమిత్తం భీమునిపట్నం కాపులుప్పాడ గ్రామంలో 76.88 ఎకరాల భూమిని APIIC విశాఖపట్నం జోనల్ మేనేజర్‌కు ఉచితంగా కేటాయిస్తూ మంత్రిమండలి నిర్ణయం.
గుంటూరులో టెక్స్టైల్ పార్క్‌కు భూములు :
• గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం రాజాపేట గ్రామ శివారు గోపాలంవారిపాలెంలో గుంటూరు టెక్స్టైల్స్ పార్కు ఏర్పాటు కోసం మార్కెట్ విలువ ప్రకారం ఎకరా రూ.18,15,000 చొప్పున కేటాయించాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.
కర్నూలు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసుకు స్థలం కేటాయింపు :
• కర్నూలు జిల్లా దీన్నెదేవరపాడు గ్రామంలో ఇన్‌కమ్‌ట్యాక్స్ కార్యాలయ భవన నిర్మాణం, క్వార్టర్స్ నిర్మాణం కోసం ఎకరం భూమిని రూ.1,25,30,063 ధరకు అందివ్వాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.
గ్రీన్కో ఎనర్జీస్ సంస్థకు కేటాయింపు:
• కర్నూలు జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం గ్రామంలో 2467.28 ఎకరాల భూమిని 2750 మెగావాట్స్ సామర్ధ్యంతో నిర్మితమయ్యే ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటు నిమిత్తం గ్రీన్కో ఎనర్జీస్ సంస్థకు ఎకరా రూ.2,50,000ల మార్కెట్ విలువకు కేటాయిస్తూ మంత్రిమండలి నిర్ణయం.
ఇతర కేటాయింపులు :
• చిత్తూరు జిల్లా జంగాలపల్లె గ్రామంలో విద్యా సంస్థల ఏర్పాటు నిమిత్తం ఎకరా రూ.8 లక్షల మార్కెట్ విలువకు గాబ్రియేల్ ఎడ్యుకేషనల్ సొసైటీకి కేటాయిస్తూ మంత్రిమండలి నిర్ణయం.
• విజయనగరం జిల్లా భోగాపురం మండలం కొంగవానిపాలెం గ్రామంలో 36.21 ఎకరాల భూముల్ని ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు నిమిత్తం APIICకి ఉచితంగా కేటాయిస్తూ మంత్రిమండలి నిర్ణయం.
• కర్నూలు జిల్లా పెట్నికోట గ్రామంలో ఎకరా రూ.3,60,000 మార్కెట్ విలువకు 6.72 ఎకరాల భూమిని ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీకి కేటాయించాలని మంత్రిమండలి నిర్ణయం.
2092 పోస్టులకు తిరిగి నియామకాలు :
• రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి కేటాయించిన 2092 మంది ఉద్యోగులకు తిరిగి నియామకాలు (re appropriating the 2092 posts) పాలనాపరమైన మంజూరు ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం. (2088+4).
రాబోయే సాధారణ ఎన్నికల నిమిత్తం అదనపు పోస్టులు:
• వచ్చే సాధారణ ఎన్నికల్లో అదనపు సిబ్బంది నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆరు నెలల కాలపరిమితి కోసం చీఫ్ ఎలక్ట్రోరల్ ఆపీసర్ కార్యాలయానికి, జిల్లా కార్యాలయాలకు అవసరమైన సిబ్బందిని నియమించుకోవడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
• చీఫ్ ఎలక్ట్రోరల్ కార్యాలయంలో 82 పోస్టులు, జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో 15 పోస్టులు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిన నియమిస్తారు.
పోస్టుల మంజూరు :
• కర్నూలు జిల్లా బనవాసిలో ఉన్న మేకలు, గొర్రెలు పరిశోధన కేంద్రంలో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది మంజూరుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీనిలో ఒక సీనియర్ సైంటిస్టుతో పాటు ముగ్గురు సైంటిస్ట్, ఒక అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్‌ను డిప్యుటేషన్ ప్రాతిపదికన నియమించుకుంటారు. మిగిలిన సిబ్బందిని కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా నియమించుకుంటారు. మొత్తం 12 మంది సిబ్బంది నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
• కర్నూలు జిల్లా బనవాసిలో మేకలు, గొర్రెలు పరిశోధన కేంద్రం మూడున్నర కోట్లతో రెండున్నర ఎకరాల్లో ఏర్పాటైంది.
ఇతర పోస్టులు :
• తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు ఒక పీఆర్వో పోస్టును మంజూరు చేశారు. అయితే ఇప్పటికే ఉన్న ఆర్టిస్ట్ కమ్ డ్రాఫ్ట్స్ మ్యాన్ పోస్టు స్థానంలో పీఆర్వో పోస్టు ఉంటుంది.
• తిరుపతి శ్రీ పద్మావతమ్మ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు అదనపు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు, కాంట్రాక్ట్ పోస్టులు క్రమబద్ధీకరణ చేస్తూ మంత్రి మండలి ఆమోదం. వీటిలో టీచింగ్ 20, నాన్ టీచింగ్ 17 పోస్టులు కాగా, మరో నాలుగు ఇతర పోస్టులను క్రమబద్ధీకరిస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
• తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో 3 రీడర్ పోస్టులను అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులుగా మారుస్తూ మంత్రిమండలి నిర్ణయించింది.
స్విమ్స్‌లో ఇక విమ్స్ డైరెక్టర్ సభ్యుడు:
• శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గవర్నింగ్ బాడీలో విశాఖ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్‌ను సభ్యుడిగా చేరుస్తూ చట్ట సవరణ చేయాలని మంత్రివర్గం సిఫారసు చేసింది.
• విభజనకు ముందు స్విమ్స్‌లో హైదరాబాద్ నిమ్స్ డైరెక్టర్ సభ్యుడిగా ఉండేవారు. విభజన తర్వాత జరిగిన పలు స్విమ్స్ సమావేశాల్లో ఆహ్వానించినప్పటికీ నిమ్స్ డైరెక్టర్ గైర్హాజరు అవుతూ ఉండేవారు. అందువల్ల ఆయన స్థానంలో విశాఖ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టరును సభ్యుడిగా చేర్చాలని ఇందుకు చట్ట సవరణ చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
నేషనల్ ఫారెస్టు పార్క్ :
• అటవీశాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటు, ల్యాండ్ ట్రాన్స్‌పోర్టు అధారిటీ ఏర్పాటుపై చర్చ.













