విజయవాడలో ఇండో అమెరికన్ సదస్సు
విజయవాడలో ఔషధ పరిశోధనలో మైలురాళ్లు అనే అంశంపై సిద్దార్థ ఫార్మసీ కళాశాలలో ఇండో-అమెరికన్ సదస్సు జరిగింది. సదస్సులో ప్రపంచంలోనే మెదడు సంబంధిత పరిశోధనలు చేసి, రెండు కొత్త మందులు ఆవిష్కరించిన ఉత్తమ పరిశోధకుల్లో ఒకరైన డి.సాంబారెడ్డితో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని టెక్సాస్ ఏఅండ్ఎం యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు. సీఎస్ఐఆర్, ఏఏసీటీ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ కే.సురేష్‌బాబు పాల్గొని ఔషధ రంగంలో నూతన ఆవిష్కరణలను వివరించారు. కార్యక్రమంలో సిద్దార్థ అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు, కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచంట సునీత, కార్యక్రమ కార్యనిర్వాహణాధికారి వి.కరణశ్రీ పాల్గొన్నారు.













