రాజమహేంద్రవరం నుంచి కొత్త విమాన సర్వీసులు
ఉభయగోదావరి జిల్లాలకు ఆకాశయానం మరింత అందుబాటులోకి రానుంది. రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి మరిన్ని విమానాలు రాకపోకలు సాగనున్నాయి. వచ్చే ఏడాది జవవరి 16వ తేదీ నుంచి ఇండిగో విమానయా సంస్థ ఒకేసారి నాలుగు సర్వీసులను ప్రారంభించనుంది. హైదరాబాద్ రెండు, బెంగళూరు, చెన్నైలకు ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఎనిమిది సర్వీసులు నడపనుంది. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఇవి తిరుగుతాయి. ఆ మేరకు ఇప్పటికే ఆ సంస్థ అన్ని చర్యలు చేపట్టింది.













