4న సింగపూర్‌కు ఇండిగో విమానం
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు డిసెంబరు 4, 5 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. వచ్చే నెల 4న ప్రారంభం కానున్న విజయవాడ-సింగపూర్ అంతర్జాతీయ విమాన సర్వీసును ఆయన పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. 5న విజయవాడ సమీపం ఆత్కూరులోని స్వర్ణభారతీ ట్రస్టులో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఉపరాష్ట్రపతి పర్యటన వివరాలను అధికారులు ప్రకటించారు. కాగా, డిసెంబరు 4 నుంచి గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసులు మొదలుకానున్నాయి. ఈ మేరకు ఇంధన, మౌలిక సదుపాయాలు, సీఆర్డీఏ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ ఉత్తర్వులు జారీ చేశారు.













