విజయవాడలో గణతంత్ర వేడుకలు
విజయవాడలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ నరసింహాన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, హోంమంత్రి చినరాజప్ప, మంత్రులు ఉమ, ఆనంద్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని, టెక్మాలజీతో ఉత్పాదకతను పెంచుతుందని అన్నారు. విభజన కష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. సులభతర వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఏపీలో పెట్టుబడులపై అనేక కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి.
రాష్ట్రంలో మహానగరాలను సుందరనగరాలుగా తీర్చిదిద్దుతున్నాం. ప్రతి గ్రామానికి సీసీ రహదారులు నిర్మించుకున్నాం. విద్యుత్తు కొరత ఉన్న రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రంగా చేశాం. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్తు అందిస్తున్నాం. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ప్రతి ఇంటికి హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం అందిస్తున్నాం. ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమం ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎల్ఈడీ విధి దీపాలు ఏర్పాటు చేశాం. గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత తాగునీటి కోసం వాటర్ గ్రిడ్ పథకం తీసుకొచ్చాం అని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.













