ఏపీ లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
భారతదేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా శాసనసభా ప్రాంగణంలో స్పీకర్ తమ్మినేని సీతారాం జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ బాలకృష్ణమాచార్యులు, అసెంబ్లీ ఉద్యోగులు పాల్గొన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ్ కల్లమ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శులు ధనుంజయ్ రెడ్డి, సాల్కన్ ఆరోఖ్య రాజే, జే మురళి, సీఎస్‌లు జోషీ, పరమేశ్వర రెడ్డి పాల్గొన్నారు. సచివాలయ ఆవరణలో సీఎస్ నీలం సాహ్ని జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జీఏడీ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.













