Independence Day :ఆంధ్రప్రదేశ్లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుంటూరులో నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశ పవర్ఫుల్ మిసైల్ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అని తెలిపారు. వైసీపీ ఐదేళ్ల చీకటి పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో విజయవంతంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. ఉండవల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) జాతీయ జెండాను ఎగురవేశారు. మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, వారికి మిఠాయిలు అందజేశారు. అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ (Vijayanand) జాతీయ జెండాను ఆవిష్కరించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ జాతీయ పతకాన్ని ఎగురవేశారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో ఏపీసీసీ చీఫ్ షర్మిల జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు.







