ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు
ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్ అధికారులకు బదిలీలు జరిగాయి. ఈ క్రమంలోనే బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా అనంతరామును నియమించడం జరిగింది. ఆయనకే అదనంగా ఈడబ్ల్యూఎస్ సంక్షేమ విభాగం విధులు కూడా అప్పజెప్పారు. ఈ వరుసలోనే సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా జి.జయలక్ష్మి నియామకం జరిగింది. అలాగే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి రజత్ భార్గవను బదిలీ చేశారు.. ఆయన్ను ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. క్రీడలు, సాంస్కృతిక శాఖ బాధ్యతలను కూడా రజత్ భార్గవకే అప్పగించారు. మైనార్టీ శాఖ కార్యదర్శిగా ఇంతియాజ్‌కు అదనంగా పూర్తి బాధ్యతలు ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గ్రామ, వార్డు సచివాలయ డైరెక్టర్‌గా జి.లక్ష్మీ షాకు బాధ్యతలు కేటాయించారు.













