ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్త కలెక్టర్లు వీరే…
శ్రీకాకుళం-స్వప్నిల్ దినకర్, పార్వతీపురం మన్యం-శ్యామ్ ప్రసాద్, అనకాపల్లి – కె.విజయ, అంబేడ్కర్ కోనసీమ -రావిరాల మహేశ్ కుమార్, కడప -లోతేటీ శివశంకర్, పల్నాడు- అరుణ్‌బాబు, నెల్లూరు- ఒ.ఆనంద్, తిరుపతి-డి. వెంకటేశ్వర్, అన్నమయ్య- చామకుర్రి శ్రీధర్, సత్యసాయి- చేతన్, నంద్యాల -బి.రాజకుమారి, విశాఖ -హరేంద్ర ప్రసాద్ నియమితులయ్యారు.













