సీఎం రమేశ్ ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు
తెలుగుదేశం ఎంపీ సీఎం రమేశ్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని రమేశ్ నివాసంలో 10 గంటలపాటు ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సీఎం రమేశ్ సోదరుడు, సురేశ్ సమక్షంలో ఇవి కొనసాగాయి. తిరుపతి, ప్రొద్దుటూరుకు చెందిన 12 మంది ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఆస్తులకు సంబంధించిన ఐటీ రిటర్న్ దాఖలుపై అధికారులు విచారించారు. అధికారులు తమ వద్ద నుంచి ఎలాంటి పత్రాలను స్వాధీనం చేసుకోలేదని సీఎం రమేశ్ సోదరుడు సురేశ్ తెలిపారు. తాము నిజాయతీగా ఉన్నాం కాబట్టే 10 గంటల పాటు సోదాలు చేసినా ఎలాంటి ఆధారాలు లభించలేదని ఆయన అన్నారు.













