ఏపీలో హెచ్ సీటీజీ పెట్టుబడులు
చైనాకు చెందిన పలు ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్ సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేందుకు సుముఖత చూపించాయి. ఫైబర్ కేబుల్ సిరీస్, డిజిటల్ కేబుల్ సిరీస్, నెట్వర్క్, క్యాబినెట్స్, ఆప్టికల్ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ తదితర పరికరాల తయారీలో సేవలందిస్తున్న హెచ్‌సీటీజీ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామంటూ మంత్రి లోకేశ్ సమక్షంలో ఒప్పందం చేసుకుంది. సౌర విద్యుత్ సంబంధిత పరికరాల తయారీలో ఉన్న సీఈటీసీ ఎలక్ట్రానిక్స్ కూడా రాష్ట్రానికి వచ్చేందుకు సుముఖత చూపింది. రైసెన్ సోలార్ టెక్నాలజీ, సన్నీ ఆప్టికల్ టెక్నాలజీ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలను పరిశీలించి ముందడుగు వేస్తామని హామీ ఇచ్చాయి. చైనా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్ బీజింగ్‌లో పలు కంపెనీల సీఈవోలతో జరిపిన చర్చల్లో ఈ మేరకు స్పందన వచ్చింది. రాష్ట్రంలో పెట్టుబడికి అవకాశాలు, సుపరిపాలన, వేగంగా అనుమతులు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ప్రథమస్థానం రావడం తదితర విషయాలను వివరించి పెట్టుబడులు పెట్టాలని కోరారు.













