రాష్ట్రంలో మొత్తం 19,57,429 ఇళ్లు మంజూ రు : చంద్రబాబునాయుడు
నిర్మాణం పూర్తయిన ఇళ్లు 7,45,339
నిర్మాణ దశలో మరో 11,61,812 ఇళ్లు
ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణం కింద 10,00,086 ఇళ్లు మంజూరు కాగా 4,06,142 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది
పీఎంఏవై-ఎన్టీఆర్(గ్రామీణ్) పథకం కింద 1,20,943 ఇళ్లు మంజూరు, 43,071 ఇళ్ల నిర్మాణం పూర్తి
పీఎంఏవై-ఎన్టీఆర్(అర్బన్) పథకం కింద 3,86,804 ఇళ్లు మంజూరు, 69,963 ఇళ్ల నిర్మాణం పూర్తి
ఎన్టీఆర్ స్పెషల్ హౌసింగ్ కింద హుద్‌హుద్ బాధితులకు 9,170 ఇళ్లు మంజూరు చేయగా, 8,788 ఇళ్ల నిర్మాణం పూర్తి
గతంలో 9ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా వద్ద ప్రతిభ అవార్డులు పొందినవాళ్లు ఇప్పుడు కనబడినప్పుడు అప్పుడు పొందిన ప్రతిభ అవార్డే తనకు స్ఫూర్తి అయ్యిందని, ఆ స్ఫూర్తితోనే తరువాత ఆయా రంగాలలో ముందంజ వేశానని చెప్పడం వాళ్లకే కాదు మనకు సంతోషాన్ని,స్పూర్తిని ఇస్తుంది. కాబట్టి యువతను ప్రోత్సహించడంలో అధికార యంత్రాంగం మరింత శ్రద్ద చూపాలి. ఉపాధి కల్పించే పరిశ్రమలు,సంస్థలతో సమన్వయం చేసుకోవాలి. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి.
గత 3ఏళ్లో ఎన్టీఆర్ రూరల్ హవుసింగ్ కింద మంజూరైన 6లక్షల ఇళ్లలో ఇంకా రూ.60వేల ఇళ్ల పనులు ప్రారంభం కాలేదు.వాటిని వెంటనే ప్రారంభించేలా చూడాలి.
గ్రామాల్లో, పట్టణాల్లో ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణకు ‘గృహమిత్ర’లను నియమించుకోవాలి. మెప్మా,డ్వాక్రా మహిళలను గృహమిత్రలుగా ఎంపిక చేయాలి. ఇంటికి ఇంత చొప్పున వారికి ఆనరోరియం ఇచ్చేలా చూడాలి. ఇళ్ల నిర్మాణంలో గ్రామీణ,పట్టణ శాఖల మధ్య సమన్వయమే ముఖ్యం. ఇంకా ఇళ్లులేని పేదలు 10లక్షల మందిపైగా ఉన్నట్లుగా ఆధార్ లింకేజిబట్టి తెలుస్తోంది. పేదలు అందరికీ ఇళ్లు నిర్మించాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. జన్మభూమి లోపల ఎంతమందికి ఇళ్లు లేవో అంచనా వేయాలి. వాళ్లందరికీ కూడా జన్మభూమి కాగానే ఇళ్ల మంజూరుపత్రాలు ఇవ్వాలి. జనవరిలో మరో 4లక్షల ఇళ్ల నిర్మాణ పనులకు పునాదులు వేసేలా చూడాలి.మంచిరోజు చూసి భారీఎత్తున మళ్లీ సామూహిక గృహ ప్రవేశాలను పండుగగా జరపాలి.













