జస్టిస్ ఎన్.వి.రమణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. వర్సిటీలో జరిగిన 37, 38న స్నాతకోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ ఎన్.వి. రమణను గౌరవ డాక్టరేట్‌తో యూనివర్శిటీ సత్కరించింది. అనంతరం సీజేఐ విద్యార్థులకు పట్టాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఆచార్య నాగార్జున వర్సిటీకి గొప్ప చరిత్ర ఉంది. డాక్టరేట్ ఇచ్చి గౌరవించిన వర్సిటీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత సమాజంలో విద్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ వర్సిటీ నుంచి వెళ్లిన చాలా మంది వివిధ హోదాల్లో ఉన్నారు. వృత్తి విద్యా కోర్సులు అభ్యసించిన వారికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇదే వర్సిటీలో నేను కూడా చదివా. యూనివర్సిటీలో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. మేం చదివేటప్పుడు వర్సిటీలో ఇన్ని గదులు లేవు. సమాజంలోని అనేక విషయాలపై చర్చ జరిపేవాళ్లం. ఇప్పుడలాంటి చర్చలు విద్యార్థులు జరుపుతున్నట్లు కనిపంచడం లేదు. ప్రజాసమస్యలపై అవగాహన కలిగి, వాటికి పరిష్కారం చూడగలిగాలి అని అన్నారు.













