ఆయనకు 900 మంది సెక్యూరిటీ కావాలా? : హోంమంత్రి అనిత
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సెక్యూరిటీని తాము తగ్గించలేదని, భద్రత కుదించారంటూ ఆయన అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత అన్నారు. రాజమహేంద్రవరం జైలును మంత్రి పరిశీలించారు. అనంతరం అనిత మీడియాతో మాట్లాడుతూ సెక్యూరిటీ లేకపోతే ప్రజలు దాడిచేస్తారని జగన్ భయపడుతున్నారు. రాష్ట్రంలో 20 వేల మంది పోలీసుల కొరత ఉంటే ఆయనకు 900 మంది సెక్యూరిటీ కావాలా? అని ప్రశ్నించారు. మా అధినేత చంద్రబాబు ఎలాంటి తప్పు చేయకపోయినా 53 రోజులు జైలులో పెట్టారు. నేడు పరిస్థితులు తారుమారయ్యాయి. స్నేహ బ్లాక్ వద్దకు వెళ్లాక బావోద్వేగానాకి గురాయ్యను. జైలులో ఖైదీల సౌకర్యాలు పరిశీలించాను అని అనిత తెలిపారు.













