సీఎస్ ఓవరాక్షన్ : ఉపముఖ్యమంత్రి చిన్నరాజప్న
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై కొంతమంది అపోహలు కల్పిస్తున్నారని ఉపముఖ్యమంత్రి చిన్నరాజప్న అన్నారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ టీటీడీపై కొంత మంది అపోహలు కల్పిస్తున్నారని, వాటిని నివృత్తి చేయవలసిన బాధ్యత అధికారులదేనన్నారు. దీనిపై సీఎస్ ఓవరాక్షన్ చేస్తున్నారని తెలిపారు. సీఎస్‌ను అడ్డు పెట్టుకుని చంద్రబాబు నాయుడు పరిపాలనను నియంత్రించేందుకు మోడీ కుట్రలు చేస్తున్నారని తెలియజేశారు. చంద్రబాబు పరిపాలన చేయనీయకుండా సీఎస్ సమీక్షలు జరపడం ఏంటని ఆయన ప్రశ్నించారు.













