మహానాడుకు తప్పనిసరిగా గుర్తింపు కార్డు
మహానాడుకు హాజరయ్యే ప్రతీ ఒక్కరికి గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి, జిల్లా ఇన్ఛార్జీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఇంతవరకూ చేసిన ఏర్పాట్లు, చేయాల్సిన పనులపై ప్రజా ప్రతినిధులతో చర్చించారు. పార్టీ పరంగా హాజరయ్యే ప్రతినిధులకు వారి వద్ద ఉన్న పార్టీ గుర్తింపు కార్డుల ఆధారంగా అక్కడికక్కడే ప్రవేశ పాసులు జారీ చేయనున్నారు. ప్రతినిధులందరికీ వ్యక్తిగత ఆహ్వానాలు పంపుతున్నారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఏయా ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగే మహానాడును పురస్కరించుకుని నగరం మొత్తం పండుగ వాతావరణం తలపించేలా సిద్ధం చేస్తున్నారు. కూడళ్లన్నీ పచ్చతోరణాలతో అలంకరిస్తున్నారు. వంట సామగ్రి దిగుమతి చేసుకుంటున్నారు.













