ఆ పథకాలే టీడీపీని గెలిపిస్తాయి
ప్రభుత్వ సంరక్షకుడిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ అంశాలపై సమీక్షలు చేస్తున్నారని, సమీక్షలు చేస్తేనే ప్రజాసమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతాయని హోంమంత్రి చినరాజప్ప తెలిపారు. సచివాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను దెబ్బతీయడానికి వైసీపీ తీవ్రంగా ప్రయత్నించిందని ఆరోపించారు. స్పీకర్‌పై వైసీపీ నేతలు ఎలా దాడి చేశారో అందరూ చూశారని, అలాంటి పార్టీ అధినేత రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడడమా అని ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ డీజీ, కొందరు ఎస్సీలను ఈసీ ఉద్దేశపూర్వకంగానే బదిలీ చేసిందన్నారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యతలు ఈసీ పరిధిలోకి వస్తాయన్నారు. సంక్షేమ పథకాలే టీడీపీని గెలిపిస్తాయని చినరాజప్ప ధీమా వ్యక్తం చేశారు.













