టార్చర్ చూపించారు.. సోషల్ మీడియా పై ఏపీ హోం మినిస్టర్..
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో గత కొద్దికాలం గా సోషల్ మీడియా ఓ పెద్ద పాత్ర పోషిస్తుంది. మంచిని మాత్రమే ప్రచారం చేస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ కొంతమంది సోషల్ మీడియాని అడ్డుగా చేసుకొని కొందరు నాయకుల్ని టార్గెట్ చేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అయితే విషయం అక్కడితో ఆగిపోవడం లేదు.. ఇంటిలోని ఆడవారిపై కూడా అసభ్యకరమైన కామెంట్స్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలకి తాను కూడా బలయ్యాను అని పవన్ కళ్యాణ్ అనడం.. ఆంధ్రాలో సోషల్ మీడియా ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉందో చెప్పకనే చెబుతుంది.
పలు అధికారిక అకౌంట్స్ లో కూడా ఎటువంటి వేధింపులకు సంబంధించిన వీడియోలు, పోస్టులు ఉండడం ఎంతో దారుణం. ఇటీవల పవన్ కళ్యాణ్ తన బిడ్డలకు ఎదురైన అనుభవం గురించి మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ హోం మంత్రి అనిత కూడా ఈ విషయంపై స్పందించారు. సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల తాను కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు ఆమె పేర్కొన్నారు. ఆంధ్రాలో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఎన్నో తప్పుడు, నీచమైన ప్రచారాలకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చింది అని పేర్కొన్న అనిత.. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టే వారిని వదిలే ప్రసక్తే లేదని పేర్కోన్నారు. వారు సప్త సముద్రాల అవతల వెళ్లి దాక్కున్న వదలమని ..చర్యలు తీసుకుంటామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు అని అనిత పేర్కొన్నారు.
గతంలో తాను ఎదుర్కొన్న సోషల్ మీడియా ట్రోలింగ్స్ గురించి ప్రస్తావించిన అనిత.. తాను మానసికంగా గట్టిదాన్ని కాబట్టి తట్టుకున్నానని.. లేకపోతే ఎప్పుడో సూసైడ్ చేసుకొని చనిపోయేదాన్ని పేర్కొన్నారు. మొన్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు హోమ్ మినిస్టర్.. చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియా ట్రోలింగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సెలబ్రిటీలే ఈ ట్రోలింగ్ బారి నుంచి తప్పించుకోలేకపోతే మరి సామాన్యుల పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది.













