Suraksha Program: సురక్షా 360 కార్యక్రమాన్ని ప్రారంభించిన హోంమంత్రి అనిత
ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో సురక్షా 360 కార్యక్రమాన్ని (Suraksha 360 program) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) ప్రారంభించారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని హోంమంత్రి అనిత అన్నారు. సాంకేతికత వినియోగంలో ఎన్టీఆర్ జిల్లా (NTR District) కమిషనరేట్ ముందంజలో ఉందని ప్రశంసించారు. మోడల్ పోలీసు స్టేషన్లు జిల్లా మొత్తం విస్తరించాలని సురక్ష యాప్, సురక్ష డివైస్ల వల్ల ప్రజలకు ఎంతో మంచి జరుగుతుందన్నారు. ఇటీవల ఆన్లైన్ మోసాలు (Online scams) బాగా పెరిగాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలోని ఆలయం, చర్చి, మసీదులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా 28 సురక్ష డివైస్ కిట్‌ను అధికారులకు మంత్రి అందజేశారు. ప్రతి గామం, ప్రతి వీధి సీసీ కెమెరాల (CC cameras) పర్యవేక్షణలో ఉండాలనేది సురక్షా 360 లక్ష్యమని ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్‌బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు సుజనాచౌదరి, గద్దె రామ్మోహన్, బోడా ఉమా తదితరులు పాల్గొన్నారు.













