తిరుపతిలో షియోమీ కంపెనీ ఏర్పాటు
రాష్ట్రానికి మరో కంపెనీ వచ్చింది. తిరుపతిలో షియోమీ మొబైల్ విడిభాగాల ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ హోలీ టెక్ ను నెలకొల్పనున్నారు. షియోమీ మొబైల్ విడిభాగాల తయారీ కంపెనీ హోలీ టెక్ కు, ఆంధ్రప్రదేశ్ మధ్య ఈమేరకు ఒప్పందం కుదిరింది. సచివాలయంలోని బ్లాక్ 1 లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్, షియోమీ కంపెనీ ప్రతినిధుల సమక్షంలో కుదిరిన ఒప్పందం జరిగింది. దేశంలో మొటమొదటిసారిగా రాష్ట్రంలో ఏర్పాటు కానున్న అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ కంపెనీ హోలీటెక్ కావడం గమనార్హం.
ఈ సందర్భముగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ ప్రారంభించడం శుభపరిణామం. త్వరలో మీ పనులు ప్రారంభించండి. రాష్ట్రంలో ఏకోసిస్టం రావాడం ముఖ్యం. రాష్ట్రంలో ఏర్పాటు కానున్న అన్ని రకాల పరిశ్రమలకు తగిన సదుపాయాలూ, సౌకర్యాలు కల్పనలో చర్యలు తీసుకుంటున్నాం. తిరుపతికి చేరువలో కష్ణపట్నంతో సహా రెండు ఓడరేవులు ఉన్నాయి. ఐఐటి స్థాయి విద్యాసంస్థల ఏర్పాటు జరుగుతోంది. చెన్నై , నెల్లూరు, తిరుపతి పట్టణాలతో కూడిన త్రికోణం భూభాగం పారిశ్రామికవాడ అభివద్ధికి అనుకూలంగా ఉంటుందని చెప్పారు.
ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్, హూలీటెక్ సీఈఓ ఫ్లేమ్ చంద్, షియోమీ వైస్ ప్రెసిడెంట్ మనోజైన్ , సీఎం కార్యదర్శి రాజమౌళి, ఐటీ ముఖ్య కార్యదర్శి విజయాంద్ లు పాల్గొన్నారు.













