ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… 1 నుంచి 9 తరగతుల వరకు
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆంధప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సెలవులు ప్రకటించింది. రేపటి నుంచి సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 1 నుంచి 9 తరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు ఉండవని ఈ ఏడాది విద్యాసంవత్సరం పూర్తయినట్లు మంత్రి స్పష్టం చేశారు. పాఠశాలల్లో ఇప్పటి వరకు కరోనా నిబంధనలు పాటించామన్నారు.













