మాన్సాస్ ట్రస్టు చైర్మన్ గా.. అశోక్ గజపతిరాజు

మాన్సాస్ ట్రస్టు చైర్మన్‍గా పూసపాటి అశోక్ గజపతిరాజు బాధ్యతలు స్వీకరించారు. ట్రస్టు చైర్మన్‍గా సంచైత గజపతి నియామక ఉత్తర్వును హైకోర్టు ఇటీవల కొట్టేసిన వైనం తెలిసిందే. మరోవైపు అశోక్ గజపతిరాజునే ట్రస్టు చైర్మన్‍గా కొనసాగించాలన్న హైకోర్టు ఆదేశాలను అనుసరించి అశోక్ గజపతిరాజు బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆ సమయంలో మాన్సాస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‍తో పాటు కరస్పాండెంట్ కూడా అందుబాటులో లేకపోవడంతో అశోక్ గజపతిరాజు అసహనం వ్యక్తం చేశారు.