తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం
తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చేలా చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి లక్ష్యమని సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. విశాఖలో జరుగుతున్న అగ్రిటెక్ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సదస్సులో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టెక్నాలజీని రైతులకు చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. విశాఖలో జరుగుతున్న సదస్సు ద్వారా వ్యవసాయంలో మెళకువలు, టెక్నాలజీ అంశాలు తెలుసుకునే అవకాశం ఏర్పడిందని అన్నారు. రైతులకు ప్రయోజనం కలిగించేలా అగ్రిటెక్ సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. వినూత్నమైన సాంకేతికతతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు.













