ద్వారక తిరుమలలో హిందూధార్మిక సమ్మేళనం
హిందూదార్మిక సమ్మేళనం ఈ నెల 24, 25 తేదీలలో ద్వారక తిరుమలో నిర్వహిస్తున్నట్లు, ఇందుకు అన్ని మఠాధిపతులు, పీఠాధిపతులను ఆహ్వానిస్త్నుట్లు గజల్‌శ్రీనివాస్ తెలిపారు. స్వచ్చ్ భారత్‌లో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వుండటం ఆనందంగా వుందన్నారు. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన ఆయన ఉదయం విఐపీ బ్రేక్‌దర్శనాల సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. తిరుమల జెఇవో కెఎస్ శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటీ ఇవో కోదండరామారావు, ఓస్డీ డాలర్‌శేషాద్రి, వీరికి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేశారు.













