చంద్రబాబుకు హైకోర్టు లో ఊరట
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఉచిత ఇసుక విధానానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై నమోదు చేసిన కేసుల్లో తాము తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు కఠిన చర్యలు తీసుకోవద్దని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిలు కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై సీఐడీ తరపున అడ్వొకేట్ జనరల్ వాదనల కోసం విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఉచిత ఇసుక విధానం కేసులో సీఐడీ వాదనల నిమిత్తం విచారణ ఈ నెల 30కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.













