ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
రాజధాని ప్రాంత రైతులకు కౌలు చెల్లింపు అంశంలో సీఆర్డీఏ, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమకు వార్షిక కౌలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. రైతుల తరపున న్యాయవాది ఉన్న మురళీధర్ వాదనలు వినిపించారు. రైతులకు కౌలు చెల్లించేందుకు జీవో ఇచ్చిన ప్రభుత్వం కౌలు చెల్లించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఏటా మేలో కౌలు చెల్లించేవారని, ఈ ఏడాది ఇప్పటి వరకు చెల్లింపులు జరపలేదన్నారు. వాదనలు విన్న హైకోర్టు సీఆర్డీఏ, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.













