ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి హైకోర్టు నోటీసులు
కుల ధ్రువపత్రం వివాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటరు వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, శ్రీవాణిని ఆదేశిస్తూ విచారణను నవంబరు 17కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది బి.శశిభూషణ్‌రావు వాదనలు వినిపిస్తూ, ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదన్న ఫిర్యాదుపై అప్పీలు విచారణ గిరిజన శాఖ మంత్రికి వచ్చింది. కానీ, స్వయంగా ఆమెనే ఆ శాఖ మంత్రి, అప్పీలుపై ఆమె విచారణ చేయడం చట్టవిరుద్ధం. ఈ నేపథ్యంలో ఏపీ (ఎస్సీ, ఎస్టీ, బీసీ) కుల ధ్రువీకరణ పత్రాల జారీ నిబంధనలను మేరకు అప్పీలు అథారిటీని ఏర్పాటు చేసేలా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆదేశించడం అని కోరారు.













