ఏపీలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో 3 నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. స్పెషల్ ఆఫీసర్ల పాలనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మాజీ సర్పంచ్‌లు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు తీర్చునిచ్చింది. స్పెషల్ ఆఫీసర్ల పాలనను కొనసాగిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 90ను కోర్టు కొట్టివేసింది. స్పెషల్ ఆఫీసర్లుగా ప్రభుత్వం దిగువ కేడర్ ఉద్యోగుల్ని నియమిస్తోందని, వారికి పాలనపై పట్టు ఉండటం లేదని మాజీ సర్పంచ్‌లు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఎన్నాళ్లు స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగిస్తారని మాజీ సర్పంచ్‌లు ప్రశ్నించారు.













