అచ్చెన్నాయుడుకు హైకోర్టులో ఊరట
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కేసులో ఆంధప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అచ్చెన్నాయుడికి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది. వెంటనే న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కోర్టు నిర్ణయంపై ప్రభుత్వం తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడును ఏ ఆస్పత్రికి తరలించాలన్నది ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ నిర్ధారించాలని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ప్రభుత్వ తరుపు న్యాయవాది వాదనను ధర్మాసానం తోసిపుచ్చింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అచ్చెన్నాయుడును గుంటూరు రమేష్ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.













