High Court: రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం.. 2027 నాటికి పూర్తి
రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణంలో మరో కీలక అగుడు పడిరది. గతంలో నిలిచిపోయిన హైకోర్టు (High Court)నిర్మాణ పనులు పట్టాలెక్కాయి. రాయపూడి (Rayapudi) సమీపంలో నిర్మిస్తున్న హైకోర్టు భవన నిర్మాణంలో భాగంగా రాఫ్ట్ ఫౌండేషన్ పనులను పురపాలకశాఖ మంత్రి నారాయణ (Narayana) పున ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ ఇచ్చిన డిజైన్ మేరకు హైకోర్టు పనులు పున ప్రారంభించాం. మొత్తం 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 52 కోర్టు హాల్స్‌తో హైకోర్టు నిర్మాణం జరుగుతుంది. 2, 4, 6వ అంతస్తుల్లో కోర్టు హాల్స్ ఉంటాయి. 8వ అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఉంటుంది. 2027 చివరి నాటికి హైకోర్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం అని మంత్రి పేర్కొన్నారు.






