ఏపీలో పెట్టుబడులు పెట్టండి : గవర్నర్
ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సముద్ర తీరం ఉందని, పెట్టుబడులకు రాష్ట్రం అన్ని విధాల అనుకూలమని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడలోని రాజ్భవన్లో శ్రీలంక హై కమిషనర్ ఆస్టిన్ ఫెర్నాండో గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో విశిష్ట బౌద్ధ పుణ్యక్షేత్రాల గురించి ఆయనకు గవర్నర్ వివరించారు. శ్రీలకం, ఏపీ మధ్య పర్యాటక రంగం అభివృద్ధికి సహకరించాలని కోరారు. పెట్టుబడులు పెట్టే వారికి సింగిల్ విండో పథకం ద్వారా త్వరితగతిన అనుమతులు ఇస్తున్నటు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీలంక హై కమిషనర్ ఫెన్నాండో కల్పించుకుని భారత్తో వ్యాపారం చేస్తున్న సార్క్ దేశాల్లో శ్రీలంక అతి పెద్దదని తెలిపారు. శ్రీలంక, భారత్ మధ్య అనేక రంగాల్లో మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని వివరించారు. ఈ సందర్భంగా శ్రీలంక హై కమిషనర్ గవర్నర్ను మొమెంటోతో సత్కరించారు.













