శివాజీ సంచలన వ్యాఖ్యలు.. వైసీపీలో 49 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు
అమరావతి రైతులు, మహిళల పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని సినీ నటుడు శివాజీ అన్నారు. అమరావతిపై హైకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మందడంలో రైతులు నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలోని 49మంది ఎమ్మెల్యే, 9 మంది ఎంపీలు వేరే పార్టీతో టచ్లో ఉన్నారని అన్నారు. ప్రత్యేక హోదాపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయి. మూడు రాజధానులంటూ సీఎం జగన్ ఎన్నికలకు వెళ్తారు. విశాఖ ఉక్కు, అమరావతి, ప్రత్యేక హోదా ఏమైందని మనం ప్రశ్నించాలి. ఓటుకు రూ.50 వేలు ఇచ్చినా ఈసారి వైసీపీ గెలిచే పరిస్థితి లేదన్నారు. వ్యాపారులు రాజకీయాల్లోకి రావడం వల్లే అమరావతికి ఈ పరిస్థితి దాపురించిందన్నారు. కేంద్రానికి మెజార్టీ ఉంది కదా అని హక్కులు వదిలేస్తారా? అని ప్రశ్నించారు. ఈ రోజుల్లో కూడా కులం గురించి ఎందుకు మాట్లాడుతూన్నారని ప్రశ్నించారు.













