‘ఉయ్యాలవాడ’ పేరు పెట్టడంపై హీరో చిరంజీవి హర్షం
కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఏయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టడంపై సినీ హీరో చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఆనందాన్ని కలిగించిందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ‘‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్ ప్రకటనతో ఆనందం కలిగింది. భారత ప్రథమ స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గొప్ప దేశభక్తుడు. నిజమైన యోధుడు. ఈ గుర్తింపుకు ఆయన పూర్తి అర్హులు. అలాంటి గొప్ప వ్యక్తి పాత్ర పోషించే అవకాశం నాకు లభించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను.’’ అని చిరంజీవి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.













