ఎన్నికల వేళ క్రిక్కిరిసిన బస్సులు, రైళ్లు.. భారీ సంఖ్యలో ఆంధ్రాకి తరలివస్తున్న ఓటర్లు..

ఈనెల 13 సోమవారం నాడు ఆంధ్రాలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం మరి ఎత్తున ప్రజలు సొంత రాష్ట్రానికి తరలివస్తున్నారు. ఆంధ్రాలోని స్వగ్రామాలకు తరలివస్తున్న వారి కారణంగా హైదరాబాద్ నుంచి ఆంధ్ర కి వస్తున్న బస్సులు క్రిక్కిరిసి ఉంటున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి రాజధాని కావడంతో హైదరాబాదులో ఏపీ ప్రజలు లక్షల సంఖ్యలో స్థిరపడిపోయారు. ఉద్యోగం కోసం వెళ్ళిన వలస జీవులు కూడా వారిలో ఎందరో ఉన్నారు. మరో రెండు రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. పైగా వీకెండ్ కలిసి వచ్చింది. దీంతో గంట గ్రామాలకి తరలివస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అంతేకాదు ఈసారి ఎన్నికలను ఓటర్లు కూడా ఎంతో సీరియస్ గా తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఎన్నికల రోజును సెలవ రోజుగా పరిగణించే వారు కూడా పనిగట్టుకు మరి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచే కాదు ఇటు కర్ణాటక నుంచి ఆంధ్ర కి వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఎక్స్ట్రా బస్సులు సమకూర్చినప్పటికీ ఫ్రెష్ మాత్రం తగ్గడం లేదు. దీంతో ప్రయాణికులకు కాస్త ఇబ్బంది ఎదురవుతోంది.