జగన్ కేసులో నిందితుడు శ్రీనివాస్ కు గుండెపోటు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు ఆస్వస్థతకు గురయ్యాడు. దీంతో సిట్ బృందం అతన్ని కేజీహెచ్‌కు తరలించింది. శ్రీనివాస్‌ను పరీక్షించిన వైద్యులు, అతను గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపారు. శ్రీనివాసరావు గుండెపోటుతో బాధపడుతున్నాడని, ట్రీట్మెంట్కు సహకరించడం లేదని డాక్టర్ దేముడు వెల్లడించారు. తనకు ట్రీట్మెంట్ వద్దని, అవయవ దానం చేస్తానని శ్రీనివాస్ అంటున్నాడని డాక్టర్ దేముడు చెప్పారు. అంతేకాకుండా తాను ప్రజలతో మాట్లాడాలని గట్టిగా కేకలు పెడుతున్నాడని అన్నారు.













