ఆ కేసును సీబీఐకి ఇవ్వొదు….
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తును సీబీఐకి ఇచ్చేలా ఆదేశించాలంటూ టీడీపీ నేత బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, వివేకా సతీమణి సౌభాగ్యమ్య తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. సౌభాగ్యమ్య వేసిన అనుబంధ పిటిషన్‌పై ఈ నెల 19 లోపు కౌంటర్ దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్‌ను ధర్మాసనం ఆదేశించింది. అప్పటివరకూ తుది నివేదికను రూపొందించవద్దని సిట్‌కు సూచించింది. మరోవైపు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఈ కేసులో సిట్ విచారణ తుది దశలో ఉందని, ఈ సమయంలో దర్యప్తును సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయస్థానానికి తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.













