ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల విషయంలో హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. కార్పొరేషన్ ఎన్నికలను నిలిపేయాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని, ఈ అంశాన్ని పరిశీలించాని పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను హైకోర్టు విచారించింది. ఈ ఎన్నికలను నిలిపేస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఓటర్ల జాబితాను సరిచేయాలని కూడా సూచించింది. కోర్టు ఆదేశాలను పాటించకుండానే ఎన్నికలకు వెళ్తున్నారని, వార్డుల పునర్విభజన, కుల గణన సరిగ్గా చేయకుండానే ఎన్నికలకు సమాయత్తమయ్యారని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఏపీలో 12 మున్సిపల్ కార్పొరేషన్లకు మార్చి 10న ఎన్నికలు నిర్వహించాలని ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. 2,47,631 ఓటర్లున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన పోటీ చేస్తున్నాయి. అయితే పోటీ మాత్రం వైసీపీ, టీడీపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.













