ప్రపంచ తెలుగు మహాసభలకు హర్యానా గవర్నర్
తెలుగు భాషా వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ఆంధ్రమేవ జయతే పేరిట రాజమండ్రి కేంద్రంగా ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యా సంస్థల సంయుక్త నిర్వహణలో జరిగే అంతర్జాతీయ తెలుగు మహాసభలకు హర్యానా గవర్నన్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా రానున్నారు. వచ్చే జనవరి 5 నుంచి మూడు రోజుల పాటు సాంస్కృతిక రాజధాని రాజమండ్రిలోలో శ్రీరామరాజ నరేంద్రుల పట్టాభిషేక మహోత్సవ సహస్రాబ్ధి సందర్బంగా గైట్ కాలేజీలో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నట్లు పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ , చైతన్య విద్యా సంస్థల అధినేత చైతన్య రాజు తెలిపారు.













