Harish Kumar Gupta :నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీష్‌కుమార్ గుప్తా
మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా(Harish Kumar Gupta) బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సైబర్ నేరాల నియంత్రణ కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా ఐటీ క్యాడర్ (IT Cadre )ను సిద్ధం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది పోలీసులను సైబర్ కమాండోలుగా (Cyber Commando) తీర్చిదిద్దుతం. కాన్పూర్(, Kanpur), మద్రాస్ (Madras )ఐఐటీల నుంచి 6 నెలల కాలవ్యవధితో కూడిన సర్టిఫికెట్ కోర్సులు వారితో చేయిస్తాం. మిగిలినవారికి శిక్షణ ఇచ్చేందుకు వారిని ప్రధాన శిక్షకులుగా వినియోగిస్తాం. ప్రతి జిల్లాలో ఒక సైబర్ నేరాల పోలీసు స్టేషన్‌ను ఏర్పాటు చేస్తాం అని తెలిపారు. తనకు అవకాశం కల్పించిన ముక్యమంత్రి చంద్రబాబుకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.













