టీటీడీ బోర్డు ఎక్స్ అఫీషియో సభ్యుడుగా జవహర్ లాల్ ప్రమాణ స్వీకారం
తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ) బోర్డు ఎక్స్ ఆఫిషియో సభ్యులుగా రెవెన్యూ ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ (ఎఫ్ఎసి) డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం వారితో ప్రమాణం చేయించారు. ధర్మనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, జేఈవో స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో బోర్డు సెల్ కస్తూరి బాబు, విజిఓ బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.













